the romans road



రక్షణకి రోమీయుల మార్గం ఏమిటి?

రక్షణకి రోమీయుల మార్గం అన్నది సువార్త యొక్క శుభ సమాచారాన్ని రోమీయుల గ్రంధంలో ఉన్న వచనాలని ఉపయోగించి వివరించే ఒక విధానం. ఇది సరళమయినదయినప్పటికి మనకి రక్షణ యొక్క అవసరం ఎంత ఉందో అని, దేవుడు రక్షణకి ఎలా వీలు కల్పించేడో అని, మనం రక్షణని ఎలా పొందగలమో అని మరియు రక్షణ యొక్క పర్యవసానాలు ఏమిటో అని వివరించే ఒక బలీయమైన పద్ధతి.

రక్షణకి రోమీయుల మార్గంపైన ఉన్న మొదటి వచనం రోమీయులు 3:23 లో ఉంది, “అందరును పాపము చేసి, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు.” మనమందరము పాపము చేసేం. మనమందరం దేవునికి సంతోషకరముకాని పనులని చేసేము. అమాయకుడైన ఒక వ్యక్తీ లేడు. మన జీవితాల్లో పాపం ఎలా కనిపిస్తుందో అన్న ఒక వివరమయిన చిత్రాన్ని రోమీయులు 3:10-18 ఇస్తాయి. రక్షణకి రోమీయుల మార్గముపైన ఉన్న రెండవ వచనము రోమీయులు 6:23 పాపానికి గల పర్యవసానాన్ని మనకి బోధిస్తుంది -“ఏలయనగా. పాపమువలన వచ్చు జీతము మరనము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవితము.” మన పాపాలకి మనం సంపాదించుకున్న శిక్ష మరణము. ఒట్టి భౌతికమయిన మరణము కాదు, కానీ నిత్యమరణము.

రక్షణకి రోమీయుల మార్గంపైన ఉన్న మూడవ వచనము, రోమీయులు 6:23 ఆపివేసిన వద్దనుండి ప్రారంభం అవుతుంది “అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమైయుండగానే, క్రీస్తు మనకొరకు చనిపోయెను” అని రోమీయులు 5:8 ప్రకటిస్తుంది. యేసుక్రీస్తు మనకొరకు చనిపోయెను! యేసు మరణము మన పాపాలకి మూల్యాన్ని చెల్లించింది. యేసు మరణాన్ని మన పాపాలకి మూల్యంగా దేవుడు అంగీకరించేడని యేసు యొక్క పునరుత్ధానం నిరూపిస్తుంది.

రక్షణకి రోమీయుల మార్గము యొక్క నాలుగవ మజిలీ రోమీయులు 10:9, “అదేమనగా- యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడెదవు.” మీ పక్షాన్న యేసు యొక్క మరణం వల్ల, మనం చేయవలిసినదల్లా ఆయన్ని విశ్వసించడం, మన పాపాలకి మూల్యంగా ఆయన మృత్యువుని నమ్మడం- అప్పుడు మనం రక్షింపబడతాం. “ఎందుకనగా, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును” , అని రోమీయులు 10:13 మరల చెప్తుంది.

మన పాపాలకి దండనని చెల్లించడానికి మరియు మనలని నిత్యమరణంనుంచి కాపాడటానికి యేసు మరణించేడు. ఆయన తమ ప్రభువు మరియు రక్షకుడు అని క్రీస్తునందు నమ్మకాన్ని పెట్టిన ఎవరికయినా రక్షణ, పాపాలకి క్షమాపణ లభిస్తుంది.

రక్షణకి రోమీయుల మార్గం యొక్క అంతిమ పక్షం రక్షణ యొక్క పర్యవసానాలు. రోమీయులు 5:1 లో ఈ అద్భుతమయిన సందేశం ఉంది, “ కాబట్టి విశ్వాసముమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.” ఏసుక్రీస్తు ద్వారా మనకి దేవునితో సమాధానమయిన ఒక సంబంధం ఉండగలదు. రోమీయులు 8:1 “కాబట్టి ఇప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు” అని మనకి బోధిస్తుంది. మన పక్షాన్న యేసు యొక్క మృత్యువు వల్ల మన పాపాలకోసం మనం ఎన్నడూ శిక్షావిధిని పొందం. ఆఖరికి మనకి రోమీయులు 8:38-39 నుంచి ఈ అమూల్యమయిన వాగ్దానం ఉంది,” మరణమైనను, జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతయినను సృష్టింపబడిన మరి ఏదయినను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబార న్రవని రూఢిగా నమ్ముచున్నాను.”

మీరు రక్షణకి రోమీయుల మార్గాన్ని అనుసరించడం ఇష్టపడతారా? అలా అయితే, మీరు దేవుడిని ప్రార్థించడానికి ఇక్కడ ఒక సరళమయిన ప్రార్థన ఉంది. ఈ ప్రార్థనని కానీ ఇంకే ప్రార్థనని కానీ పలికినందువల్ల మీరు రక్షింపబడరు. క్రీస్తు మీదన నమ్మకాన్ని పెట్టడం మాత్రమే మిమ్మల్ని పాపం నుండి రక్షించేది. ఈ ప్రార్థన దేవుని పట్ల మీ విశ్వాసాన్ని వ్యక్తపరిచే ఒక మార్గం మాత్రమే మరియు మీ రక్షణకి దోహదపడినందుకు మీరు ఆయనకి

“దేవా, నీ పట్ల నేను పాపం చేసేనని నాకు తెలుసు. మరియు నేను శిక్షకి పాతృడను. ఆయనయందు విశ్వాసం వల్ల నేను క్షమింపబడటానికి యేసుక్రీస్తు నా శిక్షని భరించేడు. రక్షణ కొరకు నేను నా విశ్వాసాన్ని నీమీదన ఉంచుతాను. నీ అద్భుతమైన మహిమ మరియు క్షమాపణ కొరకు కృతజ్ఞతలు- నిత్య జీవితం యొక్క బహుమానం. అమేన్‌.






AMAZING GRACE BIBLE INSTITUTE