Get right with God



నేను దేవునితో ఎలా సరిగ్గా అవగలను?

దేవునితో “సరిగ్గా” ఉండటానికి “తప్పు” అంటే ఏమిటో అని మనం ముందు అర్థం చేసుకోవాలి. సమాధానం పాపం. “మేలు చేయువారెవరును లేరు. ఒక్కడైనను లేడు” (కీర్తన 14:3). మనం దేవుని శాసనాల పట్ల తిరగబడ్డాం; మనం దారి తప్పిన గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి” (యెషయా 14:3).

చెడు సమాచారం ఏదంటే పాపానికి జీతం మృత్యువు. “పాపము చేయువాడే మరణమునొందును” (ఎహెజ్కేలు 18:4). శుభ సమాచారం ఏమిటంటే మనకి రక్షణని తెచ్చుటకు దేవుడు మనలని వెంబడించేడు. “నశించినదానిని వెదికి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను” (లూకా 19:10), మరియు “ఇది సమాప్తమాయెను” అన్న మాటలని శిలువ మీదన మరణించినప్పుడు ఆయన ప్రకటించినప్పుడు ఆయన ఉద్దేశ్యం నెరవేరింది(యోహాను 19:30).

మీ పాపాన్ని అంగీకరించడంతో దేవునితో మీకు సరియైన సంబంధం ఉండటం ప్రారంభం అవుతుంది. తరువాత దేవునితో మీ పాపం యొక్క మీ వినయం గల ఒప్పుదల మరియు పాపాన్ని పరిత్యజించే నిర్ధారణా వస్తాయి (యెషయా 57:15). “ ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును” (రోమీయులు 10:10).

మారుమనస్సు పొందడం విశ్వాసము వల్ల అనుసరించబడాలి, ప్రత్యేకంగా ఆయన మీ రక్షకునిగా ఆయన్ని పాత్రునిగా చేసిన యేసు యొక్క మరణత్యాగం మరియు మహాద్భుతమైన పునరుత్ధానం వల్ల వచ్చిన విశ్వాసం.”......అదేమనగా- యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు” (రోమీయులు 1010). యోహాను 20;27, కార్యములు 1631, గలతీయులు 2:16, 26 మరియు ఎఫసీయులు 2:8 వంటి అనేకమైన ఇతర వచనాలు విశ్వాసం యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడుతాయి.

దేవునితో సరియైన సంబంధం ఉండటం అన్నది మీ పక్షాన్న దేవుడు ఏమిటి చేసేడో అన్న మీ ప్రతిస్పందన యొక్క సంగతి.

ఆయన రక్షకుడిని పంపించేడు, మీ పాపాన్ని తీసివేసే త్యాగాన్ని ఆయన ఏర్పరిచేడు(యోహాను 1:29), మరియు “అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణ పొందుదురు” అన్న వాగ్దానాన్ని ఆయన మీకనుగ్రహిస్తాడు( కార్యములు 2:21).

పశ్చాత్తాపం మరియు క్షమాపణ యొక్క ఒక అందమైన దృష్టాంతం తప్పిపోయి దొరికిన కుమారుని ఉపమానం( లూకా 15:11-32). చిన్నకుమారుడు తన తండ్రి ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను( 13 వ వచనం). అతను తన దుర్వ్యాపారమును గుర్తించినప్పుడు అతను ఇంటికి తిరిగి రావడానికి నిర్ణయించుకున్నాడు( వచనం 18). ఇకమీదట కుమారుడనని పిలిపించుకొనుటకు తను యోగ్యుడని కానని అని అతననుకున్నాడు( 19 వ వచనం), కానీ అతను తప్పు. తప్పిపోయి దొరికిన తిరుగుబాటుదారుని తండ్రి ఎప్పటివలె ప్రేమించెను( 20 వ వచనం). అంతా క్షమింపబడింది మరియు ఒక ఉత్సవము జరిగింది( వచనం 24). క్షమాపణ యొక్క వాగ్దానంతో పాటు దేవుడు వాగ్దాలన్నిటినీ నెరవేర్చే మంచివాడు. “విరిగిన మనస్సుగలవారికి యహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు కలిగినవారిని ఆయన రక్షించును”(కీర్తన 34;18).

మీరు కనుక దేవునితో సరియైన సంబంధాన్ని కలిగి ఉండాలనుకుంటే ఇక్కడ ఒక సరళమయిన ప్రార్థన ఉంది. ఈ ప్రార్థనని కానీ లేక ఇంకే ప్రార్థనని కానీ పలకడం మిమ్ము రక్షించదని జ్ఞాపకం పెట్టుకోండి. పాపం నుంచి మిమ్ము రక్షించేది క్రీస్తునందలి విశ్వాసం మాత్రమే. ఈ ప్రార్థన దేవునిపైన మీకు ఉన్న విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి మరియు మీ రక్షణకి వీలు కల్పించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికీ ఒక మార్గం మాత్రమే.

“దేవా, నేను నీ పట్ల పాపం చేసేనని మరియు నేను శిక్షని పాత్రుడనని నాకు తెలుసు. కానీ ఆయనయందు విశ్వాసం వల్ల నేను రక్షింపబడటానికి నేను పాత్రుడనయిన శిక్షని యేసుక్రీస్తు తీసుకున్నాడు. నీ అద్భుతమయిన మహిమకి మరియు క్షమాపణకి నీకు కృతజ్ఞతలు- నిత్యజీవితం యొక్క వరం! అమేన్‌”






AMAZING GRACE BIBLE INSTITUTE