Is Jesus the only way to Heavenపరలోకానికి వెళ్ళడానికి యేసు ఒక్కడే మార్గమా?“నేను ప్రాధమికంగా ఒక మంచి వ్యక్తిని, కాబట్టి నేను పరలోకానికి పోతాను.” సరే. నేను కొన్ని చెడు విషయాలని చేస్తాను కాని నేను మంచి విషయాలని ఎక్కువ చేస్తాను, కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను.” “నేను బైబిల్ ప్రకారం జీవించనందువల్ల నన్ను దేవుడు పాతాళలోకానికి పంపించడు. కాలం మారింది!” “చిన్నపిల్లలపైన అత్యాచారం చేసేవారు మరియు హంతకులవంటి నిజమైన చెడ్డవారు మాత్రమే పాతాళలోకానికి వెళ్తారు అవన్నీ సామాన్యమైన హేతువాదాలు, కానీ నిజం ఏమిటంటే అవన్నీ అసత్యాలు. లోకానికి పరిపాలకుడైన సాతాను ఈ ఆలోచనలని మన మెదళ్ళలో నాటుతాడు. అతడు మరియు అతని మార్గాలని అనుసరించే ఎవరైనా దేవుని శత్రువు (1 పేతురు 5:8). సాతాను ఒక మోసగాడు మరియు తరచుగా మారువేషాన్ని ధరిస్తాడు 2 కొరింథీయులు 11:14), కానీ దేవునికి చెందని మనస్సులన్నిటిపైన అతనికి నియంత్రణ ఉంది. దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగసంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను(2 కొరింధీయులు 4:4). దేవుడు చిన్నపాపాలని పట్టించుకోడు అని నమ్మడం లేక పాతాళలోకము “చెడ్డవారి” కోసము ప్రత్యేకింపబడి ఉందని నమ్మడం ఒక అబద్ధము. పాపమంతా మనలని దేవునినుండి వేరుపరుస్తుంది, “ఒక చిన్న అబద్ధమైనప్పటికీ” కూడా. ప్రతిఒక్కరు పాపం చేసేరు మరియు పరలోకంలోనికి తమంతట తామే ప్రవేశించడానికి ఎవరూ గానీ తగినంత మంచివారు కారు (రోమీయులు 3:23). మన మంచితనం మన చెడ్డతనం కన్నా ఎక్కువా అన్నదానిపైన పరలోకంలోకి ప్రవేశించడం ఆధారపడదుః అదే కనుక విషయమైతే మనమందరం ఓడిపోతాం. “అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు. కానియెడల కృప ఇకను కాకపోవును”( రోమీయులు 11:6). పరలోకములోనికి ప్రవేశాన్ని పొందడానికి మనం చేసే మంచిపనేదీ లేదు( తీతుకు 3:5). ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది. దానిద్వారా ప్రవేశించువారు అనేకులు (మత్తయి 7:13). దేవుడిని విశ్వసించడం లోకమర్యాద కాకపోయిన ఒక సంస్కృతిలో ప్రతి ఒక్కరూ పాపంపూరితమయిన జీవితాన్ని గడుపుతున్నప్పుడు దేవుడు దాన్ని మన్నించడు. “మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రతికించెను. మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి”( యెఫెసీయులు 2:1-2). దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడు అది పరిపూర్ణంగా మరియు మంచిగా ఉండేది. తరువాత ఆయన ఆదాముని మరియు హవ్వని సృష్టించి వారికి వారి స్వేచ్ఛానుసారమైన చిత్తాన్ని ఇచ్చేడు. దాని వల్ల వారికి దేవుడిని అనుసరించాలో లేక పాటించాలో అన్న ఎంపిక ఉండగలదు. కానీ దేవుని పట్ల అవిధేయత చూపడానికి, వారు సాతాను వల్ల ప్రలోభపరచబడి, పాపం చేసేరు. ఇది దేవునితో ఒక అన్యోన్యమైన సంబంధం ఉండకుండా వారిని(మరియు మనతో కలుపుకుని వారి తరువాత వచ్చిన ప్రతి ఒక్కరిని) వేరుపరచింది. ఆయన పరిపూర్ణుడు, పరిశుద్ధుడు మరియు పాపాన్ని తీర్పుతీర్చవలిసినవాడు. పాపులుగా మనంతట మనమే దేవునితో సఖ్యత పడలేము. కాబట్టి మనం ఆయనతో పరలోకంలో ఏకం కావడానికి దేవుడు ఒక దారిని చూపించేడు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టినవానియందు, విశ్వాసముంచు ప్రతివాడును నశింపక, నిత్యజీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను (యోహాను 3:16). “ఏలయనగా, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము, మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము. మనము మరణించనక్కరలేకుండా క్రీస్తు మన పాపాలకి మరణించవలిసి వచ్చింది. ఆయన మరణానికి మూడుదినాల పిమ్మట తను మృత్యువుపైన విజేయుడనని నిరూపించుకుంటూ ఆయన సమాధినుండి లేచెను. మనం కనుక విశ్వసిస్తే మనకి ఆయనతో ఒక వ్యక్తిగత సంబంధం ఉండేటందుకు ఆయన దేవునికి మరియు మనిషికి మధ్యన ఉన్న దూరాన్ని తొలిగించేడు. “ అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము” (యోహాను 17:3). సాతానుతో సహా అధికమంది దేవుడిని నమ్ముతారు. కానీ రక్షణని పొందడానికి మనం దేవుని తట్టు తిరిగి, ఒక వ్యక్తిగతమైన సంబంధాన్ని ఏర్పరచుకొని, మన పాపాలనుండి దూరం తొలిగి, ఆయన్ని వెంబడించాలి. మనం మన వద్ద ఉన్న ప్రతీదానితో మరియు చేసే ప్రతిదానితో యేసునందు నమ్మకాన్ని పెట్టాలి. “అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్మువారందరికి కలుగు దేవుని నీతియైయున్నది. ఏ భేదమును లేదు( రోమీయులు 3:22). క్రీస్తుద్వారా తప్పితే రక్షణకి ఇంకేమార్గమును లేదని బైబిల్ బోధిస్తుంది. యోహాను 14:6 లో “యేసు-నేనే మార్గమును, సత్యమును, జీవమును; నాద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకి రాలేడు” అని యేసు యోహాను 14:6 లో చెప్తాడు. యేసు ఒక్కడే మన పాపపరిహారాన్ని చెల్లించేవాడు కనుక రక్షణకి ఆయన మాత్రమే మార్గము (రోమీయులు 6:23). పాపం యొక్క లోతు లేక గంభీరత మరియు దాని పర్యవసానాల గురించి ఏ ఇతర ధర్మం బోధించదు. యేసు ఒక్కడే వీలుకల్పించే పాపానికి గల అనంతమైన మూల్యాన్ని ఏ ఇతర మతమూ ఇవ్వజూపదు. ఏ ఇతర “మత మూలపురుషుడూ “ మనిషి అయిన దేవుడు కాడు( యోహాను 1:1,14)- ఒక అనంతమైన రుణం చెల్లించబడే ఒకటే మార్గము. మన రుణాన్ని ఆయన చెల్లించేందుకు యేసు దేవుడు అయి ఉండాలి. ఆయన మరణించేటందుకు, యేసు మనుష్యుడైయుండాలి. రక్షణ యేసుక్రీస్తునందలి విశ్వాసము వల్ల మాత్రమే లభ్యమౌతుంది ! “మరి ఎవరివలనను రక్షణ కలుగదు; ఆ నామముననే రక్షన పొందవలనుగాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను (కార్యములు 4:12). మీరు యేసుక్రీస్తును మీ రక్షకుడిగా అంగీకరించినట్లయితే, ఇక్కడ నమూనా ప్రార్థన కలదు. గుర్తుంచుకో౦డి, ప్రార్థన చెప్పటం వలన లేదా ఇంకా ఏ ఇతర ప్రార్థన మిమ్ములను రక్షించలేదు. క్రీస్తుని నమ్ముట ద్వారా మాత్రమే అనగా ఆ నమ్మకమే మీ పాపము నుండి రక్షిస్తుంది. ఈ ప్రార్థన మీకు యిచ్చిన రక్షణ గురించి స్తుతి చెల్లించటానికి మరియు ఆయనయందు మీకున్న విశ్వాసాన్ని వివరించి చెప్పే ఒక దారిమాత్రమే. “దేవా, నాకు తెలుసు, నేను మీకు విరోధముగా పాపము చేసి శిక్షకు పాత్రుడనయ్యాను. కాని క్రీస్తు నా శిక్షను తీసుకుని విశ్వాసం ద్వారా ఆయన ఇచ్చిన క్షమాపణకు అర్హుడనయ్యాను. నా నమ్మకాన్ని మీరు ఇచ్చిన రక్షణలో ఉ౦చుతాను. మీ అద్భుతమైన కృప మరియు క్షమాపణ –శాశ్వతమైన వరము నిత్యజీవము కొరకు ధన్యవాదములు. ఆమెన్". |